ట్వీట్టర్‌లో ట్రెండింగ్‌గా ‘సేవ్ సింగరేణి’

52
save singareni

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పిలుపుకు సింగరేణి కార్మికులు సంపూర్ణ మద్దతు ఇచ్చిన్రు. కోల్ బెల్ట్ లోని అన్ని అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ గనుల్లో సమ్మెకు దిగిన్రు. ఫలితంగా బొగ్గు ఉత్పత్తి నిలిచింది. టీబీజీకేఎస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గోలేటి నుంచి కొత్తగూడెం వరకు ఉన్న అన్ని గనుల ముందు భారీ సంఖ్యలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.

SaveSingareni…..బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీబీజీకేఎస్ నేతృత్వంలో సాగుతున్న సమ్మె గురించి మాజీ ఎంపీ కవిత చేసిన ట్వీట్ వైరల్ అయింది. ట్విట్టర్ ట్రెండింగ్ లో టాప్ లో నిలిచింది. వందల సంఖ్యలో రిట్వీట్ అయింది. దేశంలోని ప్రముఖ జర్నలిస్టులు, మేధావులు సింగరేణి సమ్మె గురించి ట్విట్టర్ లో చర్చించారు.

స్పందించారు. బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు వేలం వేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా వేలాదిమంది బొగ్గు గని కార్మికులు సమ్మెలో ఉన్నారన్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్‌ పార్టీ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్‌ సైతం సమ్మెలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా తాము డిమాండ్‌ చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు .