కౌగిలించుకుందని.. యువతికి 2 ఏళ్ల జైలు శిక్ష..వీడియో

241
- Advertisement -

గల్ఫ్ దేశాలలో నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే. చిన్న చిన్న వాటికే కఠినమైన శిక్షలు విధిస్తుంటారు. తాజాగా సౌదీ అరెబియాలో జరిగిన ఈ ఘటనను బట్టి.. అక్కడ శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఓ కార్యక్రమంలో ఓ వ్యక్తిని హాగ్ చేసుకున్నందుకు.. ఆ యువతికి రెండేళ్ల జైలు శిక్ష విధించనున్నారట.

saudi-woman-

వివరాల్లోకి వెళితే.. సౌదీ అరేబియాలోని రియాద్ లో ప్రముఖ సింగర్ మజిద్ ఆల్ ముహాన్ దిన్ రెండు రోజుల పాటల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముహాన్ కి గల్ఫ్ దేశాలలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ కార్యక్రమానికి కూడా భారీ మొత్తంలో సంగీత ప్రియులు, ఆయన అభిమానులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ఓ బురఖా ధరించిన యువతి, ఆయన పాటలకు పులకరించి పోయి.. సంతోషంలో ఆ సింగర్ ని హగ్ చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆమెను పోలీసులకు అప్పగించారు. బలంవంతంగా సింగర్ ని హగ్ చేసుకుందన్న ఆరోపణలతో కేసు నమోదు చేయించారు. ఆ యువతి చేసిన  తప్పుకు రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు, రూ. 18 లక్షల జరిమాణా విధించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

- Advertisement -