కొత్త వందనోటును విడుదల చేసిన ఆర్బీఐ..

266
Rs-100-Note

పెద్దనోట్ల రద్దు తరువాత రూ. 2000 నోటు, రూ. 200 ఓటు, రూ. 50 నోట్లను అందుబాటులోకి తెచ్చింది ఆర్బీఐ. ఇప్పుడు తాజాగా ముదురు నీలం రంగులో రూ.100 రూపాయల నోటును విడుదల చేసింది. ఈ కొత్త రూ.100 నోటు వెనక భాగాన ఒక వైపు గుతరాత్‏లోని 11వ శతాబ్ధానికి చెందిన చారిత్రాత్మక కట్టడమైన ‘రాణికి వావ్’‏ను ముద్రించింది. పాత రూ.100 నోటు కంటే కొంచెం చిన్నదిగా.. కొత్త రూ.10 నోటుతో పోలిస్తే కొంచెం పెద్దదిగా ఉంటుందని చెప్పింది.

new100note

 

త్వరలోనే బ్యాంకుల ద్వారా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొంది. ఈ నోటుపై 100ను దేవ నాగరి లిపిలోనూ ముద్రించారు. ఈ నోటును మడిచినప్పుడు థ్రెడ్ కలర్ నుంచి ఆకుపచ్చ రంగులోకి మారుతుందని తెలిపింది.

కొత్త రూ.100 నోట్లను కూడా రూ. 2000 నోట్లు ప్రింటింగ్ చేస్తున్న దేవాస్ లోని ప్రెస్ లోనే ముద్రిస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త నోట్ల ముద్రనకు విదేశాల నుంచి తెచ్చిన సిరానే వాడుతున్నారట. అయితే పాత రూ. 100 నోటు చలామణిలోనే ఉంటుంది. అందులో ఎలాంటి మార్పులు ఉండవు. కానీ బ్యాంకులు మాత్రం.. ఏటీఎంలలో ట్రేలను మార్చుకోవలసి ఉంటుంది.