బహుముఖ ప్రజ్ఞాశాలి.. సత్యజిత్‌ రాయ్‌

60
- Advertisement -

ప్రపంచం అగ్రశ్రేణి సినీ,దర్శకులలో ఒకరు సత్యజిత్ రాయ్. బహుముఖ ప్రజ్ఞాశాలి. దర్శకత్వమే కాదు కథారచన, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, సంగీత దర్శకత్వం, కళాదర్శకత్వం ఇలా సినిమాలకు సంబంధించిన ప్రతి క్రాఫ్ట్‌లోనూ అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆయన తీసిన సినిమాల్లో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తోంది.

కోల్‌కతాలో పుట్టి, ప్రెసిడెన్సీ కాలేజ్‌లో ఎకనామిక్స్ చదువుకున్న సత్యజిత్ 1940-41లో తమ కుటుంబానికి మిత్రుడైన రవీంద్రనాథ ఠాకూర్ బతికుండగానే శాంతినికేతన్ వెళ్ళి చిత్రకళ అభ్యసించాడు. సినిమాలూ, గ్రామఫోన్ రికార్డ్ల మోజుతో అతను 1942లో కలకత్తాకు తిరిగివచ్చాడు. 1943 నుంచి సుమారు పన్నెండేళ్ళపాటు ఒక బ్రిటిష్ అడ్వర్తైజింగ్ కంపెనీలో పనిచేశాక సినీరంగంలో అడుగుపెట్టారు.

1955లో పథేర్ పాంచాలీ సినిమాకు దర్శకత్వం వహించారు. సంవత్సరానికొక సినిమా చొప్పున తెరకెక్కించిన రాయ్‌..సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తీసిన సినిమాల్లో ఎక్కువగా బెంగాలీ సాహిత్యం నుంచి తీసుకున్న కథలైతే ,కొన్ని స్వయంగా రాసుకున్నవి. రవీంద్రుడి ‘చారులతా’ మొదలుకొని పిల్లల సినిమా ‘గోపీ గాయేన్’ వంటి జానపద చిత్రాలూ, హిందీలో ప్రేంచంద్ కథ ఆధారంగా ‘శత్‌రంజ్ కే ఖిలాడీ’, రవీంద్రనాథ ఠాకూర్ మీద అద్భుతమైన డాక్యుమెంటరీ ఇలా ప్రతీ ఒకటి ఒక అద్భుత కళాఖండం.

Also Read:కూల్ వాటర్ తాగితే.. మగవారికి ప్రమాదమా?

బెంగాలీలో అనేక కథలూ, వ్యాసాలూ, నవలలూ కూడా రాశాడు. సైన్స్ ఫిక్షన్, డిటెక్టివ్ సాహిత్యం మొదలైన ప్రత్యేక విషయాల గురించి కథలు రాసి, ఫేలూ దా మొదలైన పాత్రలతో జైసల్మేర్ కోట నేపథ్యంతో ‘షోనార్ కెల్లా’ వంటి సినిమాలు కూడా తీశాడు. 40 ఏళ్ళు సినీరంగంలో వెలిగాక చనిపోయే ముందు లైఫ్ టైం అచీవ్‌మెంట్ ఆస్కార్ బహుమతినీ, భారత రత్న బిరుదునూ పొందాడు.

తన కెరీర్‌లో 37 చిత్రాలకు దర్శకత్వము వహించాడు. ఆయన మొదటి సినిమా పథేర్ పాంచాలీ, కేన్స్ చలనచిత్రోత్సవములో 11 అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది.ఆస్కార్ అందుకున్న తొలి భారతీయుడు సత్యజిత్ రాయ్.

Also Read: IPL 2023:కోహ్లీ గంభీర్ మద్య గొడవ.. ఇప్పట్లో తగ్గదా?

- Advertisement -