కేసీఆర్‌ ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు..

115
kcr speech
- Advertisement -

సిరిసిల్ల నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఆదివారం ప్రగతి పర్యటన గావించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశమై ప్రసంగించారు. సీఎం మాట్లాడుతూ.. సభాధ్యక్షులు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, వేదికను అలంకరించిన గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌, సభలో ఆసీనులైన అందరికీ నమస్కారం తెలిపారు. రాజన్న సిరిసిల్ల ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు తాను హృదయపూర్వక అభినందలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

పరిపాలన సంస్కరణల్లో భాగంగా నూతన జిల్లాల ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపిన సీంఎ ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జ్లిలా ఏర్పాటు కావడం జరిగిందన్నారు. జిల్లా పాలన వ్యవహారాలకు సంబంధించిన ముఖ్య కార్యాలయం కలెక్టరేట్‌ ఏర్పాటు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడకముందు ఎన్నో వాదప్రతివాదాలు జరిగినట్లు తెలిపిన సీఎం మీకు ఏది చేతకాదు అనే వాదనను ఖండించినట్లు చెప్పారు. ఇందుకు నిదర్శనమే ప్రస్తుతం మన కండ్లముందు ఉందన్నారు. రాష్ట్రంలో కడుతున్న అద్భుత సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణాలకు డిజైన్‌ చేసింది మన తెలంగాణ బిడ్డ, ఆర్కిటెక్ట్‌ ఉషారెడ్డి అని వాటిని కడుతుంది తెలంగాణ ఇంజినీరు గణపతిరెడ్డి అని సీఎం పేర్కొన్నారు.

సిరిసిల్ల వేదికమీద నుంచి చెబుతున్న ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కేసీఆర్‌ ప్రయాణాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నం. ఆ దిశగా ప్రయాణిస్తున్నం. ఫలితాలు కనబడుతున్నయి. ఆ ఫలితాలు మన ముందరే కాదు యావత్‌ ప్రపంచం ముందు కూడా ఉన్నవని సీఎం అన్నారు. మనకు అపనమ్మకాలు ఎక్కువ. కానీ లక్ష్యశుద్ధి, చిత్తశుద్ధి, వాక్‌శుద్ధి ఈ మూడు తోడైతే ఏదైనా వందశాతం అయితదని సీఎం అన్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఉదాహారణ అని సీఎం పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -