తెలంగాణను మోసం చేయడమే కాంగ్రెస్ లక్ష్యం

2
- Advertisement -

నాడైనా నేడైనా ఏనాడైనా తెలంగాణకు కాంగ్రెస్ మోసమేనని రాష్ట్ర రెడ్ కో మాజీ చైర్మన్ వై. సతీష్ రెడ్డి అన్నారు. మంగళవారం విజయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో ముసుగు వేసి కప్పి ఉంచిన తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు టిఆర్ఎస్ నాయకులతో చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహంపై కపి ఉంచిన ముసుగును తొలగించి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి జై తెలంగాణ నినాదాలు చేశారు.

సతీష్ రెడ్డి మాట్లాడుతూ యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం తెలంగాణ తల్లి అని అన్నారు. అలాంటి తల్లి విగ్రహాన్ని తొలగించి నూతన విగ్రహాలను ఏర్పాటు చేయడం కన్నతల్లిని అవమానించడం తో సమానమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నియంత పాలన కొనసాగిస్తుందని తెలిపారు. తెలంగాణ దిక్సూచి అయిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాల మార్పును చేసిందని అన్నారు.

స్వరాష్ట్ర ఆకాంక్షలో భాగంగా నాడు కెసిఆర్ మేధావులు, కవులు, కళాకారులు, అన్ని వర్గాల ప్రజల ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కి రూపాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి నూతన విగ్రహాల ప్రతిష్టాపన పేరుతో తెలంగాణ తల్లిని అవమానించిందని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ పేరును లేకుండా చేద్దామని కాంగ్రెస్ ప్రభుత్వం పగటి కలలు కంటుందని, వీరుడిని ఏనాడు చరిత్ర మరచిపోదని గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన హితవు పలికారు. రానున్న రోజుల్లో అధికారంలోకి బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, మళ్లీ సీఎం కేసీఆర్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఆయన వెంట బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

Also Read:ఇండిగో సంక్షోభంపై సమగ్ర విచారణ!

- Advertisement -