హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి అంచున ఉందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. హుజుర్‌నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం కేసీఆర్‌కి గిఫ్ట్ ఇవ్వబోతున్నామని చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సత్యవతి ….సైదిరెడ్డి గెలుపు ఖాయమని…ఉత్తమ్ కుమార్,పద్మావతి రెడ్డి ఓటమి అంచున ఉన్నారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో సొంత నాయకులే ఆ పార్టీకి దూరం అవుతున్నారని… పిల్లలు లేకపోతే పెంచుకోవచ్చు.. ప్రజలు సొంత పిల్లలు అని ఉత్తమ్ ,పద్మావతి మాయ మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ఉత్తమ్ కుటుంబానికి ఘోర పరాభవం తప్పదన్నారు.
కాంగ్రెస్ పార్టీ మునిగి పోతున్న నావ అని ఆరోపించారు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాత మధు. మైనార్టీలు టిఆర్ఎస్ వైపు ఉన్నారు.. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం ఖాయం అన్నారు. వాతావరణం సహకరించక సీఎం కేసీఆర్ సభ రద్దు అయిందని చెప్పారు.