సుమన్‌,బండా ప్రకాష్‌లకు ఎంపీ సంతోష్ విషెస్

864
mp santhosh
- Advertisement -

ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎంపీ బండా ప్రకాష్‌లకు పుట్టినరోజు విషెస్ చెప్పారు ఎంపీ సంతోష్ కుమార్‌. ట్విట్టర్ వేదికగా బాల్క సుమన్‌కు శుభాకాంక్షలు చెప్పిన సంతోష్…ఆయురారోగ్యాలతో ప్రజా సేవాలో నిండునూరేళ్లు ఉండాలని ఆకాంక్షించారు. పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలని మరో ముగ్గురిని గ్రీన్ ఛాలెంజ్‌కు నామినేట్ చేయాలని సూచించారు.

రాజ్యసభలో తన సహచరుడు బండా ప్రకాష్‌కు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభకాంక్షలు చెప్పారు సంతోష్. ఈ మేరకు బండా ప్రకాష్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసిన సంతోష్..ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింతకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఒక మొక్కను నాటడమే కాదు మరో ముగ్గురిని నామినేట్ చేయాలని సూచించారు.

- Advertisement -