మేడమ్ టుస్సాడ్స్‌లో కట్టప్ప..

320
Sathyaraj to get Madame Tussauds wax statue
- Advertisement -

తనదైన నటనతో తెలుగు,తమిళ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యరాజ్. అదేనండి బాహుబలి కట్టప్ప. ఈ సినిమాలో కట్టప్ప పాత్రలో సత్యరాజ్ జీవించాడు. ముఖ్యంగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేదానిపై పెద్ద చర్చే జరిగింది. అంతటి ప్రాధాన్యం కలిగిన పాత్రని పోషించడంతో సత్యరాజ్‌ ఇప్పుడు అందరికి సుపరిచితుడిగా మారిపోయాడు.

ఇక భారతదేశ సినీచరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన బాహుబలి ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. బాహుబలి ప్రభాస్‌ మైనపు విగ్రహం ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువుదీరడంపై హాట్‌ టాపిక్‌గా మారగా తాజాగా కట్టప్ప ఆ జాబితాలో చేరిపోయాడు.

 Sathyaraj to get Madame Tussauds wax statue
లండన్ లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో కట్టప్ప మైనపు విగ్రహం కొలువుదీరనుంది. దీంతో మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో కొలువుదిరిన తొలి తమిళ నటుడిగా సత్యరాజ్ నిలవనున్నారు. ప్రభాస్ మైనపు విగ్రహాన్ని 2017లో బ్యాంకాక్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయగా కట్టప్ప విగ్రహాన్ని లండన్‌ మ్యూజియంలో ఉంచనున్నారు.

ఎంజీఆర్, శివాజీ గణేశన్, రజనీ కాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులకు సాధ్యం కాని గౌరవాన్ని సత్యరాజ్ అందుకోనుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మేడమ్ టుస్సాడ్స్‌లో సత్యరాజ్ విగ్రహం ఏర్పాటుచేయడంపై కోలీవుడ్‌ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ వార్త విని థ్రిల్లయ్యానని సత్యరాజ్‌ కుమారుడు సిబిరాజ్ ట్వీట్ చేశారు.

- Advertisement -