శశి వద్దు పన్నీరే ముద్దు….

235
- Advertisement -

జయలలిత మరణం దగ్గరినుంచి తమిళనాడు రాజకీయాలు రోజురోజు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటార అనే దానిపై సందిగ్ధత నెలకొంది. సీఎం సీటు కోసం శశికళ, పన్నీరు సెల్వం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీలో బల పరీక్షకు తాను సిద్దం మంటూ పన్నీరు సెల్వం ఇప్పటికే ప్రకటన చేశారు. సెల్వం వైపు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయం సస్పెన్స్‌గా మారింది. మరోవైపు శశికళ మాత్రం మెజారిటీ ఎమ్మెల్యేలు మొత్తం తమవైపే ఉన్నారని దీమా వ్యక్తం చేస్తుంది.

Sasikala vs Panneerselvam

ఇది ఇలా ఉంటే తమిళనాడు రాజకీయ పరిస్థితులపై సోషల్‌ మీడియాలో తాజాగా ప్రజాభిప్రాయం సేకరించారు. ఈ ప్రజా అభిప్రాయనలో   అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేయాలని లక్ష మందికి పైగా యువకులు డిమాండ్‌ చేశారు.  జయలలిత మృతితో అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన ఆమె నెచ్చెలి శశికళ సీఎం పదవిపై కన్నేయడంపై ‘మార్పు’ అనే పేరిట అప్పటికప్పుడు ఒక వెబ్‌సైట్‌ను రూపొందించి, అందులో రెండు ప్రశ్నలడిగి అభిప్రాయసేకరణను కోరారు.

‘తమిళనాడు సీఎంగా శశికళ కావాలా? పన్నీర్‌సెల్వమే కొనసాగాలా?’ అన్న ప్రశ్నకు పన్నీర్‌సెల్వం ఉంటేనే మంచిదనే సమాధానం వచ్చింది.  ద్వితీయ స్థానంలో ‘తమిళనాడు ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేసి రాష్ట్రపతి పాలన విధించాలి’ అన్న సమాధానం నిలిచింది. ఈ రెండు అభిప్రాయాలను సుమారు 1.5 లక్షల మంది పోస్ట్‌ చేయడం గమనార్హం. కాగా, శశికళను సీఎం పదవి చేపట్టనీయవద్దని హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది.

Sasikala vs Panneerselvam

ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో పార్టీల బలాబలాల  లెక్కల ప్రకారం తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే శశికళ వర్గానికి గానీ, పన్నీరుసెల్వం వర్గానికి గానీ 118 ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ఈ 118 ఎమ్మెల్యేలు ఎవరికి మద్దతు తెలిపి సీఎంగా ఎన్నుకుంటారనే విషయం తెలియాల్సి ఉంది.

- Advertisement -