శశికళకు కరోనా పాజిటివ్

173
sasikala
- Advertisement -

మరి కొద్దిరోజుల్లో తమిళనాడు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళనాట ఎన్నికల హీట్ పెరిగిపోగా విమర్శ,ప్రతివిమర్శలతో అన్నాడీఎంకే,డీఎంకే నేతలు ఒకరిపై మరొకరు నిప్పులు గక్కుతున్నారు. ఇక కరోనాతో తమిళనాడులో పలువురు ప్రజాప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొగా తాజాగా మాజీ సీఎం,దివంగత జయలలిత నెచ్చెలి శశికళకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది.

కర్ణాటకలోని పరప్పణ అగ్రహాన జైల్లో అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రికి తరలించిన జైలు అధికారులు…అక్కడ చికత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు కరోనా టెస్టులు చేయగా… ఆ రిపోర్టులో ఆమెకు పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం శశికళ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శశికళతో పాటు ఆమె బంధువులు ఇళవరసి, వీఎన్‌ సుధాకర్‌ 2017 ఫిబ్రవరి నుంచి పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. శశికళ, ఇళవరసి జరిమానాల కింద చెరో రూ.10 కోట్లను చెల్లించారు.

- Advertisement -