తమిళనాట రాష్ట్ర రాజకీయాలు పచ్చగడ్డివేస్తే బగ్గుమనేల మండుతున్నాయి. ఓకే పార్టీలో శశికళ వర్సెస్ పన్నీర్‌సెల్వం మధ్యే విభేదాలు ముదిరిపోయాయి. సీఎం పదవి నీదా నాదా సై అంటూ సవల్ విసురుకుంటున్నారు. పూటకో మాట రోజుకో నిర్ణయంతో తమిళతంబిలు ఎవరికి మొగ్గుచూపులో అర్ధం కాక తికమకపడుతున్నారు. ఇంచార్జ్ గవర్నర్ ఇరువర్గాల మధ్య ఎటూ వంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తమిళనాట రాజకీయాలు రోజురోజు వెడెక్కుతున్నాయి.
ఇక జయలలిత తీవ్ర అనారోగ్యం కారణంతో రెండు నెలలకుపైగా చెన్నైలోని అపోలో అస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయంతెలిసిందే. అయితే అమ్మ చికిత్స పొందుతున్న సమయంలో ఆస్పత్రిలో అమ్మతో పాటు శశికళ తప్ప మరెవ్వరూ లేరు. డాక్టర్లు,నర్సులు కాక అమ్మ పక్కన ఉన్న ఏకైక వ్యక్తి శశికళ. జయ చివరిసారి ఏవరితోనైన మాట్లాడిందా అంటే అది శశికళతోనే. అందువల్ల జయ ఏం చెప్పిన చిన్నమ్మకే తెలియాలి.
అయితే అమ్మ చివరి క్షణాల్లో ఏం చెప్పారో అనే విషయాన్ని శశికళ తాజాగా వెల్లడించారు. ”మన పార్టీని ఏ ఒక్కరూ నాశనం చేయలేరు” అన్నదే అమ్మ చివరి మాట అని, ఆ మాటలను జయలలిత తనతో చెప్పారని శశికళ అన్నారు. అందుకే అమ్మ పార్టీని కాపాడేందుకు నా ప్రాణాలను కూడా త్యాగం చేస్తానని తెలిపారు చిన్నమ్మ. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో కలిసి చెన్నైలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలోనే శశికళ ఈ విషయన్ని చెప్పుకొచ్చారు. పార్టీనే మనకు ఆస్తిగా అమ్మ ఇచ్చారని, దాన్ని తీసుకుని తీరాలని ఎమ్మెల్యేలతో ఆమె చెప్పారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలలో ఎవరూ పెద్దగా చదువుకోకపోయినా.. ఒకరోజు వాళ్లు ఎమ్మెల్యేలు అయ్యేలా జయలలితే వారికి శిక్షణ ఇచ్చారని, ఆమె చేసిన సేవలు మర్చిపోవద్దని వారితో అన్నారు.
అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా ఇప్పటికీ ఏడుపు వస్తుందని, ఆమెతో పాటు ఎమ్మెల్యేలు కూడా తన మీద చాలా బాధ్యత పెట్టారని, దాన్ని నెరవేర్చి తీరుతానని శపథం చేశారు. ప్రస్తుతం మనం కష్టాలు ఎదుర్కొంటున్నామని, అయినా ఎవరూ తనను ఏమీ చేయలేరని అన్నారు. తాను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని, వెనక్కి తగ్గే ప్రస్తకే లేదని ఆరునూరైన అమ్మ మాట నెరవేర్చితీరుతనని చిన్నమ్మ తెలిపారు.
ప్రతిపక్షాలు మాత్రం నేను మహిళను కాబట్టి తొక్కేయాలని తక్కువ అంచనా వేస్తున్నాయని….అంతేకాకుండా అమ్మను వాళ్లు ఏమీ చేయలేకపోయారని, అలాగే తనను కూడా ఏమీ చేయలేరని చెప్పుకొచ్చారు.