రాశీఖన్నా రెచ్చిపోతోంది..!

254
Rashi Khanna busy with new offers
- Advertisement -

ఓవైపు తన అందాలను ఆరబోస్తూనే.. కనీ కనిపించని తన అందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తూ యూత్‌ కి నిద్రపట్టకుండా చేస్తుంది యంగ్ బ్యూటీ రాశి ఖన్నా. టాలీవుడ్ లో ఈ అందాల అయస్కాంతం ఏ రేంజ్ లో అవకాశాలు అందిపుచ్చుకుంటోందో చూస్తూనే ఉన్నాం. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు చాలానే సినిమాల ప్రారంభంలో.. ఈ అమ్మడి పేరు వినిపిస్తూనే ఉంది.

అయితే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్ గా కోలీవుడ్ లో కొన్ని సినిమాలకు  గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. ఆ సినిమాలతో అక్కడ పాగా వేసేందుకు ప్రిపేర్ అవుతుంది కూడా. ఈ సినిమాలే అనుకుంటే.. మరోవైపు మల్లూ ల్యాండ్ పై కూడా కన్నేసింది రాశి ఖన్నా. ఇంకేముంది అక్కడ కూడా ఆఫర్లు వెళ్ళువెత్తుతున్నాయి.
Rashi Khanna busy with new offers
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సైన్ చేసింది రాశి ఖన్నా. ఇందులో ఈమెది ఓ హీరోయిన్ రోల్ అయినా గ్లామర్‌ యాంగిల్‌ కి దూరంగానే ఉంటుంది. ఎందుకంటే.. ఈ చిత్రంలో ఓ రిటైర్డ్ పోలీస్‌ అధికారినిగా  కనిపించనుంది. ఫుల్ సీరియస్ గా సాగే ఈ రోల్ పై రాశి ఖన్నా చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఈ సినిమాలో మోహన్ లాల్ పోలీస్‌ ఆఫీసర్‌ గా కనిపించనుంటే.. రాశిఖన్నా కూడా ఖాకీ డ్రస్ లోనే దర్శనం ఇవ్వనుంది. రాశీకి పోలీస్‌ పాత్ర కొత్తేమి కాదు.

గతంలో సాయిధరం తేజ్ మూవీ సుప్రీంలో బెల్లం శ్రీదేవిగా పోలీస్ అవతారంలో కనిపించినా.. మలయాళంలో నటించనున్న మూవీలో మాత్రం పూర్తి స్థాయిలో యాక్షన్ ఓరియెంటెడ్ లోనే రాశి పాత్ర ఉండనుంది. ఇందులో మరో హీరోయిన్ హన్సిక కూడా యాక్ట్ చేస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో విశాల్ విలన్ గా నటించనుండడం మరో స్పెషాలిటీ. ఇందులో టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.  మొత్తానికి రాశీఖన్నా చేతినిండా సినిమాలతో రెచ్చిపోతుందనే చెప్పాలి.

- Advertisement -