Tamilnadu:కొత్త పార్టీ ప్రారంభించిన శశికళ

6
- Advertisement -

తమిళనాడు ఎన్నికల వేళ కొత్తపార్టీ ఆవిర్భవించింది. దివంగత మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రామనాథపురం జిల్లా కముదిలో జరిగిన జయలలిత జయంతి వేడుకల్లో ఆమె ఈ కీలక ప్రకటన చేశారు. సభలో పార్టీ జెండాను ఆవిష్కరించిన శశికళ, ఆ జెండాలో అన్నాదురై,ఎంజీ రామచంద్రన్, జయలలిత చిత్రాలను పొందుపరిచారు.

జయలలిత మరణం తర్వాత పార్టీ మరియు రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో సమస్యలు తలెత్తాయని శశికళ అన్నారు. తాను ముఖ్యమంత్రిగా నియమించిన వ్యక్తి తనకు వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. గత తొమ్మిదేళ్లుగా మౌనంగా ఉన్నానని, ఇకపై మౌనం వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

జయలలిత ఆశయాలను కొనసాగించడం, పార్టీని పునర్నిర్మించడం తన లక్ష్యమని శశికళ పేర్కొన్నారు. కొత్త పార్టీ ద్వారా ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో తమిళనాడు రాజకీయాల్లో చర్చలు మళ్లీ వేడెక్కాయి.

Also Read:షూతో కీళ్ల నొప్పులు..షాకింగ్!

- Advertisement -