- Advertisement -
అన్నాడీఎంకే నేత,దివంగత మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని తెలిపారు బెంగళూరు మెడికల్ కాలేజీ డాక్టర్లు. ఐసీయూలో ఆమెకు చికిత్స కొనసాగుతోందని…త్వరలోనే ఆమె పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు వెల్లడించారు.
జనవరి 21వ తేదీన శశికళకు కరోనా పాజిటివ్ రాగా ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఉపిరితిత్తులు దెబ్బతినడం, మధుమేహం, రక్తపోటు ఉండటంతో నిరంతర పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు డాక్టర్లు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ఈ నెల 27 నుండి జైలు నుండి విడుదల కావాల్సి ఉంది. అయితే అంతలోనే ఆమెకు కరోనా సోకడంతో తమిళనాట చర్చనీయాంశంగా మారింది.
- Advertisement -