జయకు స్లో పాయిజన్ ఎక్కించిన శశికళ..!

89
Sasikala Giving Slow Poison To Jayalalithaa..!

అన్నాడీఎంకే అధినేత్రి జయ లలితపై ఇప్పటికే ప్రముఖ సినీ నటి గౌతమి అనుమానాలు వ్యక్తం చేస్తు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాయగా…తాజాగా తెహల్క సంచలన కథనం వైరలైంది. 2012లో తెహల్క శశికళ గురించి సంచలన కథనాన్ని ప్రచురించింది. మన్నార్ గుడి మాఫియాను ఏర్పాటు చేసుకున్న శశికళ అనేక అక్రమాలకు పాల్పడ్డారని కథనంలో ఆరోపించింది. అంతేకాదు, జయలలితను చంపేందుకు కూడా కుట్ర చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోయస్ గార్డెన్ నుంచి తనను జయ వెళ్లగొట్టిన తర్వాత… తాను నియమించిన నర్సు ద్వారా జయకు శశికళ స్లో పాయిజన్ ఎక్కించారని పేర్కొంది.

తాను వాడుతున్న మందులపై జయ చేయించుకున్న వ్యక్తిగత వైద్య పరీక్షల్లో కూడా ఈ విషయం వెల్లడి అయిందని తెహల్కా తెలిపింది. శశికళను సీఎంను చేయడానికి మన్నార్ గుడి మాఫియా ఎన్నో ప్రయత్నాలను చేసిందని ఆరోపించింది. అక్రమాలకు పాల్పడిన శశికళను, ఆమె బంధువులను పోయస్ గార్డెన్ నుంచి జయ వెళ్లగొట్టిన తర్వాత… జయను మళ్లీ మచ్చిక చేసుకుని, ఆమె వద్దకు చేరిన శశికళ… ఆ తర్వాత పోయస్ గార్డెన్ నుంచే ఆమెపై కుట్రలు సాగించిందని తెహల్కా తెలిపింది. 2012లో తెహల్కా రాసిన ఈ కథనం… ఇప్పుడు సంచలనం రేపుతోంది.

మరోవైపు శశికళ, ఆమె బృందం కలిసి జయలలితకు విషప్రయోగం చేశారని అన్నాడీఎంకే సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్‌.కృష్ణమూర్తి ఆరోపించారు. ఈ ఆరోపణలున్న ఆడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. విషప్రయోగం వల్లనే జయ మృతి చెందారని ఆయన ఆరోపించారు. అంతేగాక జయ ఆస్తులను కాజేసేందుకు శశికళ ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ వాటిని అన్యా క్రాంతం కాకుండా సుప్రీం కోర్టులో దావా వేయనున్నట్లు చెప్పారు.