ఆది…శశి ట్రైలర్ రిలీజ్

307
sasi
- Advertisement -

ఆది సాయికుమార్ హీరోగా శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘శ‌శి’. సుర‌భి నాయిక‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ఆర్‌.పి. వ‌ర్మ‌, సి. రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు నిర్మిస్తున్నారు. ల‌వ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా టీజ‌ర్‌ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయించగా తాజాగా ట్రైలర్ విడుద‌ల‌య్యింది.

‘మనం ప్రేమించే వాళ్ళు పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో.. ప్రమాదంలో ఉన్నప్పుడు అంతే భయంగా ఉంటుంది’ అనే ఆది డైలాగ్ తో ట్రైలర్ ఆరంభమైంది. ఇక ‘మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు, ముందు మన బలహీనతలను గెలవాలి’… ‘ప్రేమంటే లేని చోట వెతుక్కోవడం కాదు.. ఉన్న చోట నిలబెట్టుకోవడం’… ‘ప్రేమించిన వాడితో పెళ్లి చేయకుండా.. పెళ్లి చేసిన వాడితో ప్రేమగా ఉంటుందనుకోవడం మీ మూర్ఖత్వం’ వంటి డైలాగ్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

https://youtu.be/Hz9Hx1N9CqM
- Advertisement -