పైన ఫోటోలోని యువతిని గుర్తు పట్టారా..?… ఆ యువతిని చూస్తే ఆమెను ఎక్కడో చూసినట్టుంది కదా.. అవును మీరు అనుకుంటున్నది నిజమే… ఆ యువతి టీవీ యాడ్స్ చూసేవాళ్ళకు బాగా పరిచయమున్న మొహం సాషా చెట్రిది. ఎయిర్ టెల్ 4జి ప్రకటనలతో యావత్ భారతదేశంలో అభిమానులను సంపాదించుకుంది డెహ్రాడున్ బ్యూటీ సాషా చెట్రి. స్కూల్ రోజులనుంచే మోడలింగ్‌పై ఉన్న ఆసక్తితో ఆ రంగంలోకి అడుగుపెట్టింది సాషా. చిన్న వయసులోనే మోడలింగ్, వాణిజ్య ప్రకటనలలో సందడి చేసి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. కేవలం మోడలింగ్‌కే పరిమితం కాకుండా.. క్రియేటివిటీ, సంగీతంలో కూడా మంచి ప్రావీణ్యం పొందింది.
అయితే సాషా త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ‘వినాయకుడు’, ‘విలేజీలో వినాయకుడు’, ‘కేరింత’ చిత్రాల దర్శకుడు అడివి సాయి కిరణ్ రూపొందించనున్న తదుపరి సినిమాలో ఈ డెహ్రాడున్ భామ నటించనుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే.. హైదరాబాద్‌లో నటనకి సంబంధించిన శిక్షణ కూడా తీసుకుందట సాషా. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
సాషా చెట్రి నార్త్ ఇండియన్. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ కు చెందిన సాషా ఉన్నత విద్యాభ్యాసం ముంబైలో జరిగింది. ఎయిర్ టెల్ యాడ్ చేయడానికి మందు కాపీ రైటర్ గా పని చేసిన సాషా ఆ యాడ్ తెచ్చిన పాపులారిటీతో కొత్త కెరీర్ వైపు దారులు వేసుకుంది. ఇక్కడ క్లిక్ అయితే ఫ్యూచర్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుగా. సాషా చెట్రి అలాంటి ఆశలతోనే ఇక్కడ అడుగు పెట్టబోతోంది.