ప్రభుత్వానికి తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ బహిరంగ లేఖ రాసింది. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన 2019 నుంచి 2024 వరకు గ్రామ అభివృద్ధి చేసిన తాజా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించలేదు కావున సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహిస్తే బిల్లులు బాకీ ఉన్న సర్పంచులం అడ్డుకుంటాం ఈ పోరాటంలో మా మీద కేసులైన పరవాలేదు మా ప్రాణాలు పోయినా పర్వాలేదు మా బిల్లులు మాకు చెల్లించాలి డబ్బులు అప్పులకు తెచ్చి అభివృద్ధి పనులు చేశాం అన్నారు.
వడ్డీలకు ఇచ్చిన వారితో వేధింపులు మొదలైనవి కొంతమంది సర్పంచుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నవి కొంతమంది సర్పంచులు సూసైడ్ చేసుకున్నారు అయినా ఈ ప్రభుత్వం మా పైన కక్ష సాధింపు జరుగుతున్నది ప్రభుత్వం మా బిల్లులు చెల్లించి ఎన్నికలు నిర్వహించాలి గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలి కులగణంకాలు పూర్తి అయిన తర్వాత రిజర్వేషన్లు నిర్వహించి ఎన్నికలు నిర్వహించాలని కోరుకుంటున్నాం అన్నారు.
Also Read:పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ టూర్