NC24:చైతూ 24లో స్పర్శ్‌ శ్రీవాస్తవ

4
- Advertisement -

యువ సామ్రాట్ నాగ చైతన్య ‘తండేల్’ సంచలన విజయం తర్వాత విరూపాక్ష ఫేం కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లల్ ని చేస్తున్నారు. NC24 ఈ జానర్ ని రీడిఫైన్ చేసే సినిమాటిక్ వండర్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై BVSN ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పిస్తున్నారు.

నాగ చైతన్య కెరీర్‌లో హయ్యెస్ట్ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం వర్క్ చేస్తున్నారు. అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం అందించగా, రఘుల్ ధరుమాన్ సినిమాటోగ్రఫర్. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, మేకర్స్ ఓ కొత్త అప్‌డేట్‌ను షేర్ చేశారు. లాపటా లేడీస్ ద్వారా గుర్తింపు పొందిన స్పర్శ్ శ్రీవాస్తవ ఈ సినిమాలో ఇంతకుముందెన్నడూ చూడని లుక్‌లో నటిస్తున్నాడు. ఆయన లుక్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Also Read:Mirai:’మిరాయ్‌’ ట్రైలర్

- Advertisement -