స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్‌.. మహేష్‌ మాస్ యాక్ష‌న్ అదిరింది..

89
Sarkaru Vaari Paata
- Advertisement -

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబు, డైరెక్టర్‌ ప‌ర‌శురాం క్రేజీ కాంబినేష‌న్‌లో వ‌స్తున్నచిత్రం స‌ర్కారు వారి పాట. మహేష్‌కు జోడీగా కీర్తిసురేష్‌ న‌టిస్తోంది. ఈ మూవీ మే 12న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ తో బిజీ అయిపోయింది. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యాంకింగ్ కుంభ‌కోణాల నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంపై అంచ‌నాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

ఇక ట్రైల‌ర్‌ విషయానికొస్తే.. ‘నా ప్రేమ‌ను దొంగిలించ‌గ‌ల‌వు..నా స్నేహాన్ని దొంగిలించ‌గ‌ల‌వు..నా డ‌బ్బును దొంగిలించ‌లేవ్ అంటూ మ‌హేష్‌ మార్క్ డైలాగ్స్ తో మొద‌లైన ట్రైల‌ర్ అదిరిపోయింది. అమ్మాయిల్ని, అప్పు ఇచ్చే వాళ్ల‌ను ప్యాంప‌ర్ చేయాలి రా..ర‌ఫ్‌గా హ్యాండిల్ చేయ‌కూడ‌దంటూ‘ సాగే యాక్ష‌న్ సీన్లు..ఆ త‌ర్వాత కీర్తిసురేష్‌, మ‌హేష్‌ బాబును ఫాలో అయ్యే ల‌వ్ ట్రాక్‌, వెన్నెల కిశోర్‌, మ‌హేష్‌ మ‌ధ్య వచ్చే స‌న్నివేశాలన్నీ ఫ్యాన్స్‌కు పండేగే క‌నిపిస్తున్నాయి.

- Advertisement -