గీతాగోవిందం ఫేమ్ పరుశరామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. మే 12న భారీ అంచనాల మధ్య సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. మహేశ్ సరసన కీర్తి సరేశ్ హీరోయిన్గా నటించగా ఇప్పటికే విడుదలైన పాటలు,టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ కలిపి రూ. 96.50 కోట్లు చేసింది. నైజాం (తెలంగాణ)లో రూ. 36కోట్లు ,సీడెడ్ (రాయలసీమ): రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్ర: రూ. 12.50 కోట్లు ,ఈస్ట్: రూ. 8.50 కోట్లు, వెస్ట్: రూ. 7 కోట్లు, గుంటూరు: రూ. 9 కోట్లు ,కృష్ణా: రూ. 7.5 కోట్లు ప్రీ బిజినెస్ చేసింది.ఓవరాల్గా ప్రీ రిలీజ్ బిజినెస్ గా 120 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 121 కోట్ల షేర్ రాబట్టాలి. మరి మహేశ్ అభిమానుల అంచనాలను నిలబెడతాడో లేదో వేచిచూడాలి.