‘సర్కారు వారి పాట’ నుండి మాస్‌ సాంగ్‌ వచ్చేస్తోంది..

72
Mahesh
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అంచనాలని మరో స్థాయికి తీసుకెళ్లింది సర్కారు వారి పాట థియేట్రికల్ ట్రైలర్. అభిమానులలతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులని అలరించిన సర్కారు వారి పాట ట్రైలర్.. సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా ? అనే ఆసక్తిని డబల్ చేసింది.

ప్రస్తుతం ప్రమోషన్స్ లో దూసుకెళ్తున్న సర్కారు వారి పాట టీం నుండి మరో అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి ‘మ..మ..మహేషా’..అంటూ సాగే మాస్ సాంగ్‌ను రిలీజ్‌ చేయనున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి ‘కళావతి’, ‘పెన్నీ’.. లిరికల్ వీడియో సాంగ్స్ వచ్చి అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా నుంచి మూడవ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్ ఇస్తూ ఈ మాస్ సాంగ్ నుంచి మహేష్, కీర్తి సురేష్‌ల పోస్టర్‌ను వదిలారు. జస్ట్ పోస్టర్‌తోనే సాంగ్ మాస్ ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో అలరిస్తుందో అర్థమవుతోంది.

- Advertisement -