కేంద్రం బూస్టర్ డోస్ ఉచితంగా ఇవ్వాలి- మంత్రి హరీష్‌

66
minister harish
- Advertisement -

శుక్రవారం కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కాంప్లెక్స్‌కు వైద్య-ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే రాజాసింగ్, tsmsidc చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. అనంత‌రం మంత్రి హరీష్‌ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా టైంలో దేశ మంతా బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వల్ల అతలాకుతలం అయింది. కాని సుల్తాన్ బజార్ ఈఎన్ టీ ఆసుపత్రి వైద్యులు మాత్రం బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కు మంచి చికిత్స అందించారు. ఈ ఈఎన్‌టీ ఆసుపత్రికి సీఎం మరిన్ని డాక్టర్ పోస్టులు మంజూరు చేయడం జరిగింది. ఇవాళ 35 కోట్లతో లక్ష ఎస్.ఎఫ్.టీలో బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. ఇందులో 100 పడకలు, 8 ఆపరేషన్ ధియెటర్లు ఇతర సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఇవాళ దీనికి శంకుస్తాపన చేయడం జరిగింది. 2 కోట్లతో సిటీ స్కాన్‌ను ప్రారంభించడం జరిగింది అన్నారు.

ఈఎన్టీ ఆసుపత్రి పురాతనమైనది. అందుకే కొత్త బ్లాక్ కు శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. కోటి మెటర్నిటీ ఆసుపత్రిలో కొత్త బ్లాక్ ను, ఐసీయూను, లేబర్ రూంను ప్రారంభించుకోవడం జరిగింది. నాలుగైదు రోజుల్లో వినియోగం లోకి తేవడం జరుగుతుందన్నారు మంత్రి. నీలోఫర్ లో ఫ్రోఫెసర్ టీం 8 యూనిట్స్ ఉన్నయి. పేట్ల బురుజులో 8 టీఎం యూనిట్స్ ఉన్నాయి. కోటీలో మాత్రం రెండే యూనిట్స్ ఉన్నయి. ఇక్కడ వర్క్ లోడ్ ఎక్కువ ఉంది. డీఎంఈకి ఆదేశించాము. కొన్ని యూనిట్లు ఇక్కడకు తరలించమని చెప్పాం. రాబోయే రోజుల్లో పేట్ల బురుజు, నీలోఫర్ నుండి కొన్ని యూనిట్స్ కోటికి అవసరానికి అనుగుణంగా తరలించి వైద్య సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు. సీఎం శానిటేషన్ ను బాగా చేయాలని గత బడ్జెట్ సమావేశాల్లో 5 వేల రూపాయల నుండి 7500 రూపాయలకు పెంచాం. పాత కాంట్రాక్టులన్నింటినీ రద్దు చేశాం.ఈ నెలలో కొత్త శానిటేషన్ పాలసీ తీసుకురానున్నామన్నారు.

పని చేసే వారికి ప్రోత్సాహం- పని చేయని సబ్బిందికి కఠిన శిక్షలు తప్పవు మంత్రి స్పష్టం చేశారు. మెడికల్ కౌన్సిల్ ఆక్టివేట్ చేశాం. ఉద్దేశపూర్వకంగా ప్రయివేటు- ప్రభుత్వ రంగంలో కాని నిర్లక్ష్యం వహిస్తే ఆ ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. అవసరమైన మందులే వాడాలి. అవసరం మేరకే పరీక్షలు చేయాలి. అవసరం మేరకే ఆపరేషన్లు చేయాలి. తప్పులు చేసినట్లు రుజువయితే కఠిన శిక్షలు తప్పవు అన్నారు.కేంద్రం మంత్రికి వాక్సినేష్ ఉచితంగా ఇవ్వాలని లేఖ రాశాం. డబ్బులు తీసుకోవడం ఏంటి. కేంద్రం నుండి స్పందన లేదు. ఉచితంగా దేశ ప్రజలందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నం. మరోసారి లేఖ రాస్తామన్నారు మంత్రి హరీష్‌.

- Advertisement -