ఆర్.జి.వి పుట్టినరోజు సందర్భంగా “సర్కార్ 3” విడుదల!

221
Sarkar 3 Releasing On RGV Birthday
- Advertisement -

గాడ్ ఫాదర్ సుభాష్ సర్కార్ నాగ్రేగా అమితాబ్ బచ్చన్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేసిన చిత్రం “సర్కార్ 3”. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సర్కార్ సిరీస్ లో 3వ భాగం కావడం విశేషం. ఇదివరకు వచ్చిన రెండు పార్ట్ లు సూపర్ సక్సెస్ సాధించడంతో.. మూడో భాగాన్ని మరింత అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు దర్శకులు రాంగోపాల్ వర్మ. Sarkar 3 Releasing On RGV Birthday

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని రాంగోపాల్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 7న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మనోజ్ బాజ్ పాయ్, యామి గౌతమ్, జాకీ ష్రాఫ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన “సర్కార్ 3” చిత్రాన్ని పరాగ్ సాంఘ్వి, రాజు చడ్డా, సునీల్ ఎ.లుల్లాతో కలిసి అమితాబ్ బచ్చన్ నిర్మిస్తున్నారు.

- Advertisement -