రష్మికా…సరిలేరు నీకెవ్వరు

340
sarileru neekevvaru

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’తో సంక్రాంతికి రానున్నారు. యంగ్ అండ్ టాలెంటెడ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. జనవరి 11న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్,సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా రష్మికా లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. రష్మిక-మహేష్ బాబు పోస్టర్స్ కి ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తుంది. ఇద్దరు పెయిర్ చూసి బాగుందని కామెంట్స్ చేస్తున్నారు.

రావు రమేష్, రాజేంద్రప్రసాద్, విజయశాంతి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.

Sarileru Neekevvaru’ which translates to nobody can match you, story revolves around an Army Major played by Mahesh Babu.