ఐపీఎల్ 2020 : వేలంలో 332 మంది ఆటగాళ్లు

594
ipl 2020

పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో అత్యంత ఆదరణ పొందిన టోర్నీగా ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) కు ప్రత్యేక స్ధానం ఉంది. ఇప్పటివరకు 12 ఎపిసోడ్‌లు పూర్తిచేసుకున్న ఐపీఎల్ 13వ సీజన్‌కు సిద్ధమైంది. కోల్‌కతా వేదికగా డిసెంబరు 19న జరగనున్న వేలానికి రంగం సిద్ధమవుతోంది.

ఇప్పటికే ఆటగాళ్ల రీటైన్ పూర్తి కాగా 971 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజిష్టర్‌ చేసుకున్నారు. వీరిలో 332 మందిని షార్ట్ లిస్ట్ చేసిన ఐపీఎల్ యాజమాన్యం వీరికి సంబంధించిన జాబితాను అన్ని ఫ్రాంచైజీలకు అందజేసింది.

8 ఫ్రాంచైజీలలో 73 స్ధానాలకు వేలం జరగనుండగా ఈ సారి స్టార్ ప్లేయర్స్ మిచెల్ స్టార్క్, జోరూట్ ఐపీఎల్‌కు దూరం అయ్యారు. ఇక ఈ సారి వేలంలో 24 మంది కొత్త ప్లేయర్లు దర్శనమివ్వనున్నారు. ఇక ఈ సారి వేలంలో ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ఇయోన్‌ మోర్గాన్‌ (ఇంగ్లాండ్‌), కమిన్స్‌ (ఆసీస్‌) భారీ ధర పలకడం ఖాయం. రాబిన్‌ ఉతప్ప, క్రిస్‌లిన్‌, ఆరోన్‌ ఫించ్‌, జాసన్‌ రాయ్‌కు సైతం మంచి డిమాండ్‌ ఉంది. మొత్తంగా ఐపీఎల్‌ వేలం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

The 2020 Indian Premier League, also known as IPL 13 and officially known as Vivo IPL, will be the thirteenth season of the IPL, a professional Twenty20 cricket ..