టాప్ 50లో సరిలేరు నీకెవ్వరు..!

145
mahesh babu
- Advertisement -

ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. గతేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. మహేశ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది.

2020లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన టాప్ 50 సినిమాల్లో చోటు సంపాదించిన ఏకైక టాలీవుడ్ చిత్రంగా నిలిచింది. మహేష్ మూవీ 41వ స్థానంలో నిలిచింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎకె ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించగా ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ సహాయక పాత్రల్లో కన్పించారు.

మహేశ్‌ సరసన రష్మికా హీరోయిన్‌గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్‌3 మూవీతో బిజీగా ఉండగా మహేశ్‌.. సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు.

- Advertisement -