సరిలేరు నీకెవ్వరు..స్పెషల్

317
sarileru neekevvaru
- Advertisement -

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా దిల్ రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జి.ఎం.బి ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనిల్‌రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ప్రొఫెస‌ర్ భార‌తీగా లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టించారు. సంక్రాంతి కానుక‌గా జనవరి 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల అపూర్వ ఆద‌ర‌ణ‌తో క‌లెక్ష‌న్ల ప్రభంజనం సృష్లించి ఆల్ టైమ్ ఇండ‌స్ట్రీ బ్లాక్ బ‌స్ట‌ర్(నాన్ బాహుబలి 2) గా నిలిచింది. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 29తో 50రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైద‌రాబాద్ పార్క్ హ‌యాత్ హోట‌ల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్యఅథిలుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నిర్మాత అనీల్ సుంక‌ర స్వాగ‌తం ప‌లికారు. శ్రీ వేంకటేశ్వర క్రియేష‌న్స్‌ అధినేత, చిత్ర సమర్పకులు దిల్‌రాజు, దర్శకులు అనిల్ రావిపూడి, నిర్మాత, శ్రీ వేంకటేశ్వర క్రియేష‌న్స్‌ శిరీష్, ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్, శేఖర్ మాస్టర్, ఈ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు పాల్గొన్నారు.

అనంత‌రం..దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ – “ సరిలేరు నీకెవ్వరు` టైటిల్ లోనే అన్నిఉన్నాయి. హీరోగా మహేష్, నిర్మాతలుగా, డిస్ట్రిబ్యూటర్స్ గా అనీల్ సుంకర, దిల్ రాజు సరిలేరు మీకెవ్వరు అని నిరూపించారు. అలాగే ఎవరైనా డిప్రెషన్ లో ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే అనిల్ రావిపూడి సినిమా చూడండి అని చెప్తారేమో అంత చ‌క్క‌గా సినిమాలు తీస్తున్నారు. అనిల్ ప్రతి సినిమాలో ఒక అద్భుతమైన మెస్సేజ్ ఉంటుంది. టీమ్ అందరికీ మళ్ళీ ఇలాంటి సక్సెస్ లు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ – “సినిమా రంగం మీద ఎంతో ప్యాషన్ ఉన్న అనీల్ సుంకర గారు, డిస్ట్రిబ్యూషన్, నిర్మాణ రంగంలో ఎంతో అనుభవం ఉన్న దిల్ రాజు గారు, శిరీష్ గారు వీళ్లందరి సపోర్ట్ తో ఇంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ తీశారు. `సరిలేరు నీకెవ్వరు` అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ముఖ్యంగా అనిల్ రావిపూడి అంటే అందరికన్నా నాకు ఎక్కువ ఇష్టం. ఆయన ఇలాగే సూపర్ డూపర్ హిట్స్ తీస్తూ అందరిని నవ్విస్తూ ఉండాలనికోరుకుంటున్నాను. నాకు తెలిసిన ఎగ్జిబ్యూటర్స్ ని, డిస్ట్రిబ్యూటర్స్ ని ఇక్కడ చూస్తుంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ని కలిసినంత సంతోషంగా ఉంది. మహేష్ లాంటి ఒక సూపర్ స్టార్ తో ఇంత తొందరగా సినిమా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయ‌డం..అన్ని రికార్డులు బద్దలు కొట్టడం నిజంగా గొప్ప విషయం“ అన్నారు.

చిత్ర నిర్మాత అనీల్ సుంకర మాట్లాడుతూ – “సరిలేరు నీకెవ్వరు` సినిమా ప్రారంభోత్సవం నుండి డిస్ట్రిబ్యూటర్లు , ఎగ్జిబ్యూటర్స్, ఒక పాజిటివ్ ఎనర్జీ తో ఇది తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మారు. అలాగే ఈ సినిమా ప్రతి ఈవెంట్ ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. సినిమా విడుదలైన తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టింది. సినిమా విడుదలై యాభై రోజుల తర్వాత కూడా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు నవ్వుతూ ఈ కార్యక్రమం చేసుకోవడం ఒక అద్భుతమైన వరంగా భావిస్తున్నాను. మా దర్శకుడు అనీల్ రావిపూడి గారి కాన్ఫిడెన్స్ కి, ప్యాషన్ కి, అచీవ్ మెంట్ కి, అలాగే మీ ఆత్మీయతకి, అభిమానానికి, ఆదరణకి టేక్ ఏ బౌ“ అన్నారు.

శ్రీ వేంకటేశ్వర క్రియేష‌న్స్‌ అధినేత, చిత్ర సమర్పకులు దిల్ రాజు మాట్లాడుతూ – “సరిలేరు నీకెవ్వరు విజయవంతంగా యాబై రోజులు పూర్తి చేసుకుంది. అనిల్ రావిపూడి సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసి అనీల్ సుంకర గారికి, నాకు బ్లాక్ బస్టర్ ఇస్తానని ముందే చెప్పాడు. అలానే ఇచ్చాడు. మహేష్ బాబు గారికి కెరీర్ బెస్ట్ ఫిలిం ఇచ్చి ఇండస్ట్రీ లో నెంబర్ వన్ సినిమాగా దీన్ని తీసుకువచ్చినందుకు అనిల్ రావిపూడికి దన్యవాదాలు. ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబ్యూటర్స్ కి ప్రత్యేక దన్యవాదాలు” అన్నారు.

నిర్మాత‌, శ్రీ వేంకటేశ్వర క్రియేష‌న్స్‌ శిరీష్ మాట్లాడుతూ – “సరిలేరు నీకెవ్వరు`తో ఇంతటి ఘ‌న‌ విజయాన్ని అందించిన అనీల్ సుంకర గారికి, అనీల్ రావిపూడి గారికి ధన్యవాదాలు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాఘవేంద్రరావు, వినాయక్ గారికి నా కృతజ్ఞతలు. అలాగే ఈ విజ‌యానికి కార‌ణ‌మైన డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబ్యూటర్స్ కి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు” అన్నారు.

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగు సినిమా బ్లాక్ బస్టర్ కా బాప్ రాఘవేంద్ర రావు గారికి, కమర్షియల్ కా బాప్ వినాయక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక కమర్షియల్ సినిమాని ఎలా తీయాలో చూపించి తెలుగు సినిమాకి ఒక గ్రాఫ్ ఇచ్చిన దర్శకుడు కె రాఘవేంద్ర రావు. అలాంటి ఒక కమర్షియల్ సినిమా తీస్తున్నప్పుడే ఇది బ్లాక్ బస్టర్ అని నమ్మేలా ఆ టేకింగ్ లోనే కాన్ఫిడెన్స్ ని తీసుకువచ్చిన ద‌ర్శ‌కులు వినాయక్ గారు. నేను డైరెక్టర్ అవ్వడానికి వినాయక్ గారే కారణం. గుంటూరు హరి హర మహల్ లో `ఆది` సినిమాకి వెళ్తే పిల్లోడు రెండు బాంబులు వేయగానే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వి.వి.వినాయక్ అని స్క్రీన్ మీద పడుతుంది. ఆ టైమ్ లో థియేటర్ అంతా విజిల్స్, క్లాప్స్ తో నిండిపోయింది. అప్పుడు ఒక డైరెక్టర్ కి ఇంత వేవ్ ఉంటుందా? అని ఆశ్ఛర్యం వేసి గూస్బమ్స్ వచ్చాయి. ఆరోజే సినిమా ఇండస్ట్రీ కి వెళ్తే డైరెక్టర్ గానే వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను. తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలు తీసిన దర్శకుల మధ్య నేను నిలబడినందుకు గర్వంగా ఉంది. ఈ సంవత్సరం తెలుగు సినిమాకి మర్చిపోలేని సంక్రాంతి. మైండ్ బ్లాక్ రెవెన్యూస్ వచ్చాయి. ప్రతి సంవత్సరం ఈ రెవెన్యూ ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను. `ఎఫ్ 2` జరుగుతున్న సమయంలోనే కథ విని నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ప్ర‌త్యేక ధన్యవాదాలు. ఆయన ఒక్కటే అడిగాడు మైండ్ బ్లాక్ బ్లాక్ బస్టర్ ఇవ్వమని అలానే ఇచ్చాను. అందరం చాలా హ్యాపి. నా సినిమాలని ఇలానే ఆదరించాలని కోరుకుంటున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేక్షకులు ..సరిలేరు మీకెవ్వరు” అన్నారు.

ఈ కార్యక్రమంలో నైజాం డిస్ట్రిబ్యూటర్ శ్రీ వేంకటేశ్వర ఫిలిమ్స్ దాస్, వైజాగ్: శ్రీ వేంకటేశ్వర ఫిలిమ్స్ భాస్కర్, వెస్ట్: ఆదిత్య ఫిలిమ్స్ ఎల్.వి.ఆర్, సీడెడ్: సాయి చంద్ర ఫిలిమ్స్ నరసింహ, కృష్ణ: క్రేజీ సినిమాస్ రాజా, గుంటూరు: మెహర్ మూవీస్, పద్మాకర్ సినిమాస్ పద్మాకర్, సాయికృష్ణ, ఈస్ట్: వింటేజ్ క్రియేషన్స్ శివరామ్, జె.కె.రామకృష్ణ, నెల్లూరు: హరి పిక్చర్స్ హరి ల‌కు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతులమీదుగా ‘సరిలేరు నీకెవ్వరు’ ఫిఫ్టీ డేస్ షీల్డ్ ను అందజేశారు. చిత్ర యూనిట్, మిగ‌తా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్ల‌కు నిర్మాత అనీల్ సుంక‌ర‌, ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఫిఫ్టీ డేస్ షీల్డ్ ను అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కో ప్రోడ్యూస‌ర్ కిషోర్ గ‌రిక‌పాటి, ఆర్ట్ డైరెక్ట‌ర్ ప్ర‌కాశ్‌, వి.ఎఫ్‌.ఎక్స్ యుగేంద‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సూపర్‌స్టార్‌మహేశ్ బాబు, రష్మిక మందన్నా,రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్ త‌దిత‌రులు నటించిన‌ ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, అజ‌య్ సుంక‌ర‌, త‌మ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్ టి. ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

- Advertisement -