సీఎం కేసీఆర్‌ను కలిసిన సర్దార్ రవీందర్ సింగ్..

196
- Advertisement -

గురువారం కరీంనగర్ నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్వాదపూర్వకంగా కలిశారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు ఈరోజు హైదరాబాద్‌లో ప్రగతి భవన్‌లో ఆయన కలిశారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ పోటీ చేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు స్థానిక సంస్థలలో నెలకొన్న సమస్యలు మరియు సిక్కు సామాజిక వర్గం 1832 నుండి ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రికి దృష్టికి రవీందర్‌ సింగ్‌ తీసుకు పోవడంతో అన్నింటికీ సానుకూలంగా స్పందించారు సీఎం కేసీఆర్. రానున్న రోజులలో ఈ అన్ని సమస్యలను పరిష్కారం చేసుకుద్దాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ హామి ఇచ్చారని ఈ సందర్భంగా రవీందర్‌ సింగ్‌ తెలిపారు.

సర్దార్ రవీందర్ సింగ్ వెంట నాయకులు సాదవేణి శ్రీనివాస్, గుంజపడుగు హరిప్రసాద్, దండబోయిన రాము, వినయ్, మరియు సిక్కు సమాజిక వర్గం నాయకులు ఎక్బల్ సింగ్, అర్బన్ సింగ్, ఇందర్ సింగ్, దర్శన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -