కోలీవుడ్ సీక్వెల్ సినిమాలతో బిజీగా గడుపుతోంది. మొన్నటికిమొన్న విక్రమ్ సినిమాతో సీక్వెల్ ను షూర్ చేసిన లోకేశ్కనగరాజ్. ఇంతకి ఎవరు సినిమా చేస్తున్నారని అని అలోచిస్తున్నారా… వన్స్ ఏ స్పై ఆల్వేస్ స్పై అనే డైలాగ్‌తో వచ్చిన సినిమా సర్ధార్. ఇప్పుడు తాజాగా సర్దార్-2ను సీక్వెల్‌కు సిద్దం చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ప్రిన్స్ మీడియా సంస్థ దీనికి సంబంధించిన సీక్వెల్ ను త్వరల్లో సెట్ పైకి తీసుకెళ్లుతున్నట్టు ట్విటర్ ద్వారా ప్రకటించింది.
తెలుగు తమిళ ప్రేక్షకులకు సుపరిచితమైన కార్తి…హీరోగా వచ్చిన సర్దార్ మూవీని పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. సర్దార్ సినిమాను అక్టోబరు21న తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదలై నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. కాగా ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతుందని సినిమా చివరలో పరోక్షంగా హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్ పీఎస్ మిత్రన్.
ప్రస్తుతం సర్దార్2 చిత్రంపై కార్తీ టీం అధికారికంగా అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు, మూవీ లవర్స్‌ని ఫుల్ జోష్‌లో నింపారు. ఒకసారి స్పై అయితే, ఎప్పుడూ స్పై.. మిషన్ త్వరలో మొదలవుతుంది.. అంటూ మేకర్స్ సర్దార్ 2 గురించి చెబుతూ చిన్న వీడియోను షేర్ చేశారు. పీఎస్ మిత్రన్ డైరెక్ట్ చేయనున్న సర్దార్ 2 మూవీ 2023లో విడుదల కానుంది.
అయితే కార్తి వచ్చే యేడాది ఫుల్‌గా సీక్వెల్ మూవీస్‌తో రానుండటం విశేషం. సర్దార్, ఖైదీ, పొన్నియన్సెల్వన్1 లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు సీక్వెల్లో వస్తున్నాయి. మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ -2, పీఎస్ మిత్రన్ డైరెక్షన్లో సర్దార్2, లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో చేయబోతున్న ఖైదీ 2 కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. ఓ యాక్టర్ ఇలా వరుసగా సీక్వెల్ సినిమాల్లో రావడం చాలా అరుదని కోలీవుడ్ ప్రచారం.
ఇవి కూడా చదవండి..