వికాస్ వశిష్ట(సినిమా బండి ఫేమ్), బిందు మాధవి హీరోహీరోయిన్లుగా సరస్వతి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2 గా రూపొందుతోన్న చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాకి శ్రీ చైతు దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి పాపులర్ సింగర్ సునిత క్లాప్ నివ్వగా నిర్మాత డా. అన్నదాత భాస్కర రావు స్క్రిప్ట్ ను దర్శకుడికి అందజేశారు. దర్శకుడు శ్రీ చైతు మొదటి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల14నుండి మొదలుకానుంది.
పూజా రామచంద్రన్ కీలకపాత్రలో నటిస్తుండగా సమీర్, మధుమణి, సనా, జబర్దస్ రాజమౌళి, బాహుబలి కిరణ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సునిల్ కశ్యప్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా సాగర్ వైవీవీ మరియు జితిన్ మోహన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.
తారాగణం:
వికాస్ వశిష్ట (సినిమా బండి ఫేమ్), బిందు మాధవి, పూజా రామచంద్రన్, సమీర్, మధుమణి, సనా, జబర్దస్ రాజమౌళి,బాహుబలి కిరణ్, నాగ దుర్గ, శ్రీనివాసులు,
సాంకేతిక వర్గం:
బ్యానర్:- సరస్వతి క్రియేషన్స్
నిర్మాత:- డా. భాస్కర్ రావు అన్నదాత
కథ, అడిషినల్ స్క్రీన్ ప్లే & దర్శకత్వం:- శ్రీ చైతు
సంగీతం:- సునీల్ కశ్యప్
స్క్రీన్ ప్లే:- రాజేంద్ర కోవెరా
డీఓపి:- సాగర్ వైవివి & జితిన్ మోహన్
ఎడిటర్:- కోటగిరి వెంకటేశ్వర రావు
కాస్ట్యూమ్స్ & స్టైలింగ్:- రేఖా బొగ్గరపు
సాహిత్యం:- సుద్దాల అశోక తేజ & విశ్వనాథ్
గాయకులు:- సునీల్ కశ్యప్, సునీత ఉపద్రస్తా, యాజిన్ నిజార్
ఆర్ట్:- బ్రహ్మనాథ్ ఎ పాటిల్
కొరియోగ్రఫీ:- సత్యం
కాస్టింగ్ డైరెక్టర్:- పుష్పా భాస్కర్
ప్రొడక్షన్ మేనేజర్: జగన్
ప్రొడక్షన్ కంట్రొలర్: సన్నీ, వెంకట్ రెడ్డి
పీఆర్ఓ:- వంశీ-శేఖర్