1942 నాటి క్విట్ ఇండియా మూవ్మెంట్ సందర్భంగా జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఏవతన్ మేరే వతన్. ఈ సినిమాలో సారా అలీఖాన్ కీలక పాత్రలో పోషించనుంది. భారత స్వాతంత్ర సంఘటనలలో ఒక యధార్థమైనదిగా… దాని నుండి ప్రేరణ పొందిన థ్రిల్లర్ డ్రామా ఆవిష్కరించబడింది అని సారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బొంబాయిలోని ఒక కళశాల అమ్మాయి స్వాతంత్ర సమరయోధురాలిగా మారిన తీరును ఈ సినిమాలో వివరించనున్నట్టు టీజర్‌ను చూస్తే అర్థమవుతుంది.
ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్…కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. సోమెన్ మిశ్రా సహా నిర్మాతాగా వ్యవహరించనున్నారు. కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహించారు. దరాబ్ ఫరూకీ మరియు కన్నన్ అయ్యర్ సంయుక్తంగా నిర్మిస్తున్న సోమవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఇవి కూడా చదవండి…