సచిన్‌కు సారీ చెప్పిన పాక్ స్పిన్నర్..!

303
saqlain musthaq
- Advertisement -

దాయాదుల పోరు అంటే భారత్- పాక్‌ దేశాల మధ్య ఉండే అటెన్షన్‌ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఊపిరి బిగపట్టుకుని అంతా చాలా ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురుచూస్తుంటారు. ఈ సందర్భంగా పాక్ లెజెండ్ డౌలర్‌ సక్లయిన్ ముస్తాక్…భారత్‌తో మ్యాచ్ సందర్భంగా ఓ అనుభవాన్ని వివరించారు.

సచిన్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సచిన్ టెండూల్కర్‌ని స్లెడ్జింగ్ చేసినందుకు తాను సిగ్గుపడ్డానని సక్లయాన్ ముస్తాక్ వెల్లడించాడు. 1997లో సహారా కప్ అనుకుంటా.. సచిన్‌ని తొలిసారి స్లెడ్జింగ్ చేశానని…అతను మాత్రం హుందాగా జవాబిచ్చి తాను సిగ్గుపడేలా చేసినట్లు చెప్పుకొచ్చాడు.

సచిన్ నా వద్దకు వచ్చి.. నేను ఎప్పుడూ నీ దగ్గర మిస్‌బిహేవ్ చేయలేదు. మరి నువ్వు ఎందుకు నాతో ఇలా తప్పుగా ప్రవర్తిస్తున్నావ్..? అని అడిగాడు. దాంతో సచిన్‌కి ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక సిగ్గుతో తలదించుకున్నానని చెప్పాడు.

- Advertisement -