టాలీవుడ్ అగ్రహీరోల్లో నెంబర్ వన్‌గా నిలిచారు హీరో మహేష్ బాబు. బాలీవుడ్‌కి చెందిన ఓ మీడియా సంస్థ ఒర్మాక్స్…టాలీవుడ్ హీరోలపై సర్వే నిర్వహించి లిస్టును ప్రకటించింది. ఈ లిస్టులో మహేష్ బాబు ఫస్ట్ ప్లేస్ దక్కించుకోగా తర్వాతి స్ధానంలో స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు.
మూడో స్థానంలో ప్రభాస్, నాలుగో స్థానంలో పవన్ కల్యాణ్, ఐదో స్థానంలో ఎన్టీఆర్, ఆరో స్థానంలో చిరంజీవి, ఏడో స్థానంలో రామ్ చరణ్, ఎనిమిదో స్థానంలో నాని, తొమ్మిదో స్థానంలో విజయ్ దేవరకొండ , పదో స్థానంలో విక్టరీ వెంకటేష్ ఉన్నారని ఒర్మాక్స్ వెల్లడించింది.
టాలీవుడ్‌లో మహేష్ ఫస్ల్ ప్లేస్ దక్కించుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. అయితే మరికొంతమంది మాత్రం ఈ సర్వే భోగస్ అని…తమ హీరోనే టాలీవుడ్ బెస్ట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

