డజన్ సినిమాలతో వస్తున్న సప్తగిరి…!

573
sapthagiri
- Advertisement -

హాస్యనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా మారిన నటుడు సప్తగిరి. పరుగు సినిమాతో మంచి పేరుసంపాదించుకున్న సప్తగిరి ,ప్రేమకథా చిత్రమ్,వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్‌గా కమెడీయన్‌ నుంచి హీరోగా మారిన సప్తగిరి తిరిగి మన మనసు మార్చుకున్నాడు.

హీరోగా అవకాశాలు తగ్గిపోవడంతో తిరిగి కమెడీయన్‌గా రాణించాలని భావిస్తున్నారు. హీరోగా అదృష్టం కలిసిరాకపోవడంతో ఆయన్ని దర్శక,నిర్మాతలు ఎవరు కామెడీ రోల్స్‌ కోసం సంప్రదించట్లేదట. దీంతో మనసు మార్చుకున్న సప్తగిరి తిరిగి ప్రేక్షకులకు తన కామెడీతో నవ్వించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా తన వద్దకు వచ్చే నిర్మాతలకు నో చెప్పకుండా సంతకాలు చేస్తున్నాడు సప్తగిరి.

ప్రస్తుతం డజనుకి పైగా సినిమాలతో బిజీ ఆర్టిస్టుగా మారాడు సప్తగిరి. తనకు లైఫ్ ఇచ్చిన కామెడీ రోల్స్‌తో సప్తగిరి తిరిగి ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాడో వేచిచూడాలి.

- Advertisement -