అల్లు అర్జున్‌ని ఆగం చేసిన రాములో..!

520
allu arjun
- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా దీపావళి కానుకగా సెకండ్ సింగిల్‌ని విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో సెకండ్ సాంగ్‌ ప్రొమోని విడుదల చేసింది చిత్రయూనిట్. రాములో రాములా నన్ను ఆగం జేసిందిరో .. రాములో రాములా నా పాణం దీసిందిరో” అంటూ సాగే సాంగ్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

క్లాస్ సెట్లో మాస్ బీట్ తో సాగే ఈ పాట మాస్ ఆడియన్స్ కి ఈ బీట్ మంచి ఊపును .. ఉత్సాహాన్ని తెచ్చేదిలా వుంది. పూర్తి పాటను ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నారు.

https://youtu.be/w7Nm_RHOCT8

- Advertisement -