బాలకృష్ణ వందో సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. సినిమా విజయవంతం కోసం శాతకర్ణి పోస్టర్స్‌తో డిజైన్ చేసిన మూడు వాహనాల్లో, భారతదేశంలోని 100 క్షేత్రాలకు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.తాజాగా కమెడీయన్ సప్తగిరి హీరోగా తెరకెక్కిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ కూడా పుణ్యక్షేత్రాల యాత్రకు బయలుదేరనుంది.
శ్రీ సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై మాస్టర్ హోమిమోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ నిర్మించిన సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్. టాలీవుడ్ స్టార్ కమెడియన్ సప్తగిరి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సప్తగిరి ఎక్స్ ప్రెస్ టీమ్ దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించనుంది.
ఈ బృందం ముందుగా డిసెంబర్ 17న శ్రీశైలం,డిసెంబర్ 20న తిరుపతి,డిసెంబర్ 21న షిరిడి వెళ్లనుంది చిత్ర బృందం. ఇది ఇలా ఉంటే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియోకు, టీజర్ కు, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అదే రీతిన వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న సినిమాకు కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందని సప్తగిరి ఎక్స్ ప్రెస్ టీమ్ థీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో కన్నడ భామ రోషిణి ప్రకాష్, సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. హైదరాబాద్, పోలాండ్, జర్మనీల్లో సప్తగిరి ఎక్స్ ప్రెస్ షూటింగ్ జరిగింది.
సినిమాటోగ్రాఫ్ రామ్ ప్రసాద్, ఎడిటర్ గౌతంరాజు ఈ సినిమాను తమ నైపుణ్యంతో ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించే విధంగా తీర్చి దిద్దారని చిత్ర బృందం తెలిపింది. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ : డాక్టర్ వాణి రవికరిణ్, సినిమాటోగ్రాఫర్ : సి.రామ్ ప్రసాద్, ఎడిటిర్ : గౌతంరాజు, క్రియేటివ్ హెడ్ : గోపాల్ అమిరశెట్టి, మాటలు : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల.