‘మీటూ’.. అమితాబ్‌పై ఆసక్తికర విషయాలు..!

232
- Advertisement -

లైంగిక వేధింపుల ఆరోపణలు బాలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి. తమ జీవితంలో జరిగిన లైంగిక దాడులు, వేధింపుల గురించి బాలీవుడ్‌కు చెందిన పలువురు మహిళలు ‘మీటూ’ ఉద్యమం ద్వారా బయటపెడుతున్నారు. ఇదివరకే బాలీవుడ్ నటుడు నానా పటేకర్ పై తనూశ్రీ దత్తా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనూశ్రీ దత్తాకు మద్దతు పలుకుతూనే పలువురు మీటూ అంటూ తమకు ఎదురైన అనుభవాలను చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు పెద్ద మనుషుల బండారాలు బయటకు వస్తున్నాయి. ఇదే సమయంలో అమితాబ్ గురించి కూడా ఏదైనా షాకింగ్ విషయం వినాల్సి వస్తుందా అనే ఆందోళన ఆయన అభిమానుల్లో వ్యక్తం అవుతుంది.

Amitabh

తనూశ్రీ దత్తా విషయంలో అమితాబ్ స్పందించకపోవడంతో కొందరు ఆయనను విమర్శిస్తున్నారు. తనూశ్రీ దత్తా కూడా తన విషయంలో బిగ్ బి స్పందించక పోవడంతో ఒకింత అసహనం వ్యక్తం చేసింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో అమితాబ్ సోషల్ మీడియా ద్వారా మీటూ ఉద్యమానికి మద్దతు పలికాడు. తాజాగా అమితాబ్ పోస్ట్‌కు ప్రముఖ హెయిర్ స్టైలిష్ట్ సప్నా మోతీ భవ్నానీ విభిన్నంగా స్పందిస్తూ..ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

సప్నా మోతీ భవ్నానీ ట్వీట్లో విషయాలు ఏంటంటే.. మీరు మాట్లాడినది పెద్ద అబద్దం మీ పింక్ సినిమా వచ్చి పోయింది దాంతో మీకున్న సామాజిక వేత్త అనే మంచి పేరు కూడా పోయింది. మీ గురించిన నిజాలు త్వరలో బయటకు వస్తాయి. నా ఈ ట్వీట్ చూస్తూ మీరు గోళ్లు కొరుకుతూ ఉంటారు. అయితే ముందు ముందు మీరు కొరుక్కునేందుకు గోళ్లు కూడా ఉండవు అంటూ పోస్ట్ చేసింది. సప్నా ట్వీట్ తో బాలీవుడ్ లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. అమితాబ్ గురించి ఏ సమయంలో ఎలాంటి పిడుగు లాంటి వార్త వినాల్సి వస్తుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు బిగ్ బి అభిమానులు సప్నాను సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్‌ పెడుతున్నారు.

- Advertisement -