తెలుగునాట సినీ వార పత్రికల్లో ‘సంతోషం’ రూటే సెపరేట్.. ఓ సాధారణ జర్నలిస్ట్ స్థాయిలో జీవితాన్ని ప్రారంభించిన సురేష్ కొండేటి అంచెలంచెలుగా ఎదిగి ‘సంతోషం’ పేరుతో సినిమా పత్రికను స్థాపించి సంచలనం సృష్టించారు. 2002లో సినీ అతిరథుల సమక్షంలో ప్రారంభమైన ‘సంతోషం’ దిన దిన ప్రవర్ధమానంగా వెలుగొందుతూ నేటికీ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకు పోతోంది. తనను ఇంతటి స్థాయికి చేర్చిన సినీ పరిశ్రమ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ‘సంతోషం’ సినీ అవార్డ్స్‌ను ప్రవేశపెట్టారు సురేష్ కొండేటి.
గత 21 సంవత్సరాలుగా అప్రతిహతంగా ఈ వేడుక కొనసాగుతూనే ఉంది. తాజాగా 22వ సంతోషం అవార్డ్సు వేడుకను డిసెంబర్ 2వ తేదీన గోవాలో భారీగా నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు సురేష్ కొండేటి. అలాగే ఓటీటీ పేరుతో థియేటర్స్‌కు ప్రత్యామ్నాయంగా ప్రేక్షకుడి ఇంటికే వచ్చేసిన వినోదాన్ని కూడా సత్కరించి, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత సంవత్సరం ‘సంతోషం`ఓటీటీ’ అవార్డ్స్ పేరుతో ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలకు సైతం అవార్డులు ఇవ్వడం మొదలు పెట్టారు సురేష్ కొండేటి. ప్రపంచ సినీ చరిత్రలో ఇదో తొలి అడుగు అని చెప్పాలి. తాజాగా సంతోషం`ఓటీటీ అవార్డ్స్ రెండో సంవత్సర వేడుకల్ని శనివారం హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌లో సినీ ప్రముఖుల మధ్య ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మురళీమోహన్, జయసుధ, సంచలన రచయితలు విజయేంద్రప్రసాద్, సత్యానంద్, ఎస్.వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, కె.యస్. రామారావు, జేడీ చక్రవర్తి, వేణు, నిరుపమ్, ఓంకార్, సుహాస్, అనసూయ, హంసానందిని, డిరపుల్ హయత్, జోష్ రవి, దర్శకులు వశిష్ట, సాయిరాజేష్, రేలంగి నరసింహారావు, నిర్మాతలు రాధామోహన్, వాసు, ఎస్‌కెఎన్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, టి. ప్రన్నకుమార్, లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేకే గ్రూప్ (క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్), అక్షర గ్రూప్ అధినేతలు కోట కుమార్, రాజేష్‌లు మాట్లాడుతూ…సంతోషం అవార్డ్స్‌ను ఇంత ప్రెస్టీజియస్‌గా నిర్వహిస్తున్న సురేష్ కొండేటి గారికి అభినందనలు. ఈ అవార్డ్స్‌ను పొందిన నటీనటులు, టెక్నీషియన్స్‌కు కంగ్రాట్స్ చెపుతున్నాం. మమ్మల్ని ఈ ఓటీటీ అవార్డ్స్ వేడుకలో అసోసియేట్ చేసిన సురేష్ గారికి ధన్యవాదాలు. పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది. కానీ సురేష్ గారు మాత్రం ఎప్పుడూ కొత్తకొత్త థాట్స్‌తో రాకెట్‌లాగా ముందుకు దూసుకు పోతూనే భవిష్యత్తులో మరింతగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ‘సంతోషం’తో మా జర్నీ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాం అన్నారు.
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ…ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన సంతోషం పత్రికకు, సురేష్ కొండేటి గారికి థ్యాంక్స్. అలాగే ‘నిశానీ’ టీం అందరికీ నా కృతజ్ఞతలు.జయసుధ మాట్లాడుతూ…
సంతోషం ఓటీటీ అవార్డ్ విన్నర్స్ అందరికీ నా బెస్ట్ విషెస్. ఓటీటీ అనే ఓ మంచి ప్లాట్‌ఫామ్ దొరికింది మనకు. సురేష్ కొండేటి గారు ఇలాంటి మరెన్నో వేడుకలు నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఓటీటీ వల్ల అనేక మంది అమేజింగ్ యాక్టర్స్ మన ముందుకు వస్తున్నారు. ఇట్స్ రియల్లీ గ్రేట్. కొందరి నుంచి మేం ఇంకా నేర్చుకోవాలేమో అనిపించేంత టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్‌లు ఉన్నారు అన్నారు.
జేడీ చక్రవర్తి మాట్లాడుతూ…జయసుధ గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ రోజు ఈ స్థాయికి చేరటానికి కారణమైన నాకు నేనే పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎందుకంటే అందరూ స్కూల్‌కు వెళుతుంటే నేను స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లాను. అందరూ ట్యూషన్‌కు వెళుతుంటే నేను ట్యూషన్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లాను. సినిమా ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు పడ్డాను, కష్టాలు పడ్డాను. ‘దయ’ వెబ్ సిరీస్‌కుగాను నాకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. సురేష్ కొండేటి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. దయ టీం అందరికీ, హాట్‌స్టార్ వారికి థ్యాంక్స్.
నటి అనసూయ మాట్లాడుతూ…నన్ను ఈ అవార్డ్స్‌కు ఎంపిక చేసినందుకు సంతోషం సురేష్ కొండేటి గారికి థన్యవాదాలు. జయసుధ గారి చేతుల మీదుగా ఈ అవార్డ్స్ అందుకోవటం మరింత సంతోషంగా ఉంది. ఈ అవార్డ్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ‘ప్రేమ విమానం’లో నా పాత్ర నాకు బాగా నచ్చి చేసింది. నాతో పాటు ఈ ఓటీటీ అవార్డ్స్ అందుకుంటున్న అందరికీ కంగ్రాట్స్ అన్నారు.
Also Read:Bigg Boss 7:కోట బొమ్మాలితో బిస్ బాస్
తాజా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ…సంతోషం ఓటీటీ అవార్డ్ విన్నర్స్ అందరికీ నా తరపున, తానా తరపున కంగ్రాట్స్ చెపుతున్నాను. మేం అమెరికాలో ఏ పెద్ద కార్యక్రమం నిర్వహించినా మన సినిమా వారు ఉంటేనే దానికి నిండుదనం, సక్సెస్ వస్తాయి. భవిష్యత్తులో అమెరికాలో నిర్వహించే కార్యక్రమాలకు మా వంతు సహకారం అందిస్తాం. ఈ సంతోషం ఓటీటీ అవార్డ్స్‌ను నిర్వహిస్తున్న సురేష్ కొండేటి గారికి అభినందనలు అన్నారు.
నిర్మాత మండలి అధ్యక్షులు దాము మాట్లాడుతూ…ఇన్ని సంవత్సరాలుగా సినిమా అవార్డ్స్, రెండు సంవత్సరాలుగా ఓటీటీ అవార్డ్స్ అందిస్తున్న సంతోషం సురేష్‌కు నా హృదయ పూర్వక అభినందనలు అన్నారు.బుల్లితెర సంచలనం, దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ…నన్ను ఈ అవార్డ్‌తో ప్రోత్సహించిన సురేష్ కొండేటి గారికి థ్యాంక్స్. 21 సంత్సరాలుగా సినీ అవార్డ్స్ ఇవ్వడం ఆయన ప్యాషన్ ఏంటో చెపుతోంది. నాకు ఈ అవార్డ్ రావటానికి కారణమైన డిస్నీ హాట్‌స్టార్ వారికి, మా యూనిట్ అందరికీ థ్యాంక్స్ చెప్పారు.
Also Read:ఫైనల్లో నిరాశపర్చిన రోహిత్ సేన..