ప్రకృతి ప్రేమికులు సత్యనారాయణని గొడ్డలితో దాడి చేయడం బాధాకరం అన్నారు. నిమ్స్ వైద్యులతో మాట్లాడి అయన అర్యోగం గురించి ఆరా తీశారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. మంచి వైద్యం అందచేయాలని వైద్యులను కోరినట్లు తెలిపారు.
ఇలాంటి దాడి మంచి పద్ధతి కాదని దీనికి సంబంధించిన వారిని వెంటనే ప్రభుత్వం చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని సంతోష్ కుమార్ కోరారు. ఈ సందర్బంగా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రకృతి ఉంటేనే మనం ఉంటామని, ప్రకృతి లేకుండా మనుషులము ఉన్నా కూడా ఈ జీవితం వ్యర్థం అని, నేను అడవిని స్వంతంగా సృష్టించింది నా సొంత ప్రయోజనాల కోసం కాదని సమాజం కోసమని ఇలాంటి దానికి సహకరించాల్సింది పోయి నా మీద భౌతిక దాడి చేశారని అన్నారు.
నా ప్రాణం పోయినా పరవాలేదు కానీ చివరి శ్వాస వరకు అడవిని కాపాడుతా అని ప్రకృతిని పరిరక్షణ కు పాటుపడుతా అన్నారు. సంతోష్ కుమార్ కూడా పచ్చదనాన్ని పెంచడం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం తో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినందుకు నా అభినందనలు తెలిచేస్తున్నాను అన్నారు. నా పై జరిగిన దాడిని తీసుసుకొని వచ్చి పరామర్శించి నాకు అండగా ఉంటానని ధైర్యాన్ని నింపిన సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవేందర్ యాదవ్, కిషోర్ గౌడ్, గర్రెపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌కు హైకోర్టులో రిలీఫ్

