- Advertisement -
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకు స్పూర్తని చెప్పారు రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్. కీసరగుట్టలో 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న సంతోష్…ఎకో టూరిజం పార్క్‌కు శంకుస్ధాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..జీవితంలో సమాజం తనకు ఎంతో ఇచ్చిందని తెలిపారు. సమాజానికి ఎంతో కొంత మేలు చేయడానికే నా ఈ ప్రయత్నం అని చెప్పారు. సీఎం కేసీఆర్ వద్ద 20 ఏళ్లుగా ఉంటున్నా …ఏ పని చేపట్టినా పూర్తి చేయాలనే పట్టుదలను సీఎం కేసీఆర్ నుంచే నేర్చుకున్నానని చెప్పారు. రామలింగేశ్వరస్వామి సాక్షిగా కీసర అడవిని అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు.
- Advertisement -