టీవీకే విజయం చారిత్రాత్మకం:సంతోష్

6
- Advertisement -

తమిళనాడు ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన విజయ్ కి మాజీ ఎంపీ సంతోష్ కుమార్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. టీవీకే సాధించిన ఈ విజయం చారిత్రాత్మకమని, విజయ్ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకానికి ఇది నిదర్శనమని వెల్లడించారు సంతోష్ కుమార్.

​గతంలో విజయ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ లో ఉత్సాహంగా పాల్గొన్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు సంతోష్ కుమార్. పర్యావరణ బాధ్యత, హరిత భవిష్యత్తు పట్ల విజయ్ కి ఉన్న నిబద్ధత స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు సంతోష్ కుమార్.

విజయ్ నాయకత్వంలో తమిళనాడు రాష్ట్రం అభివృద్ధి, శ్రేయస్సులో సరికొత్త శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ప్రజా సేవలో, రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విజయ్కి గొప్ప విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్.

- Advertisement -