ఘనంగా సంతోష్ కుమార్ బర్త్‌ డే వేడుకలు

4
- Advertisement -

గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.పుట్టినరోజు సందర్భంగా మొదట బంజారాహిల్స్ లోని వెంగల్ రావు పార్క్ లో గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా స్కూల్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా చిన్నారులు సంతోష్ కుమార్ కి పుష్ప గుచ్చాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అక్కడే ఉన్న పారిశుధ్య కార్మికులు సంతోష్ కుమార్ కి శుభాకాంక్షలు తెలిపారు.

తగ్గుతున్న పచ్చదనం, అంతరించిపోతున్న అడవులు భవిష్యత్తులో మానవాళికి పెద్దముప్పుగా పరిగణించాలని, అలాగే పెరుగుతున్న కాలుష్యం కూడా వాతావరణ మార్పులకు మరో కారణమని సంతోష్ అన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు, పచ్చదనాన్ని కాపాడటం, అడవుల రక్షణకు పాటుపడడం అవసరమని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మన్నే కవిత,బీఆర్ఎస్ నాయకులు మన్నే గోవర్ధన్ రెడ్డి,గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ,గ్రీన్ చాలెంజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

అనంతరం జూబ్లీహిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సతీసమేతంగా దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ పూజారులు సంతోష్ కుమార్ కి వేదశీర్వచనాలు అందజేశారు.అనంతరం నందినగర్ లో తన సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసారు.ఈ సందర్భంగా కేటీఆర్ సంతోష్ కుమార్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అక్కడే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్యనాయకులు సంతోష్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా కీసర రామలింగేశ్వర స్వామి ఆలయ అర్చకులు సంతోష్ కుమార్ కి వేదశీర్వచనాలు అందజేశారు.

మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ని కలిసిన వారిలో మాజీమంత్రి మహమూద్ అలీ,ఎమ్మెల్యే ముఠా గోపాల్,మాధవరం కృష్ణరావ్ మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్,సుంకె రవి శంకర్, మాజీ బీసీ కమిషన్ మెంబర్ కిషోర్ గౌడ్,సుమిత్ర ఆనంద్ తానోభా, పాటిమిడి జగన్, చిరుమల్ల రాకేష్, దుది మెట్ల బాలరాజు, శుభప్రద్ పటేల్,రాజీవ్ సాగర్,పూర్ణ చందర్ నాయక్, గర్రెపల్లి సతీష్, శ్రవణ్, రాజు, భోజ నారాయణ, షఫీ సినీనటులు కాదంబరి కిరణ్, జబర్దస్త్ రాకేష్, జోర్డార్ సుజాత ప్రముఖ గాయని వాణి వళ్ళాల మరియు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Also Read:Harish:మాట మార్చడమే మీ విధానమా?

- Advertisement -