లండన్ క్లైమేట్ వీక్-2026లో సంతోష్ కుమార్

3
- Advertisement -

హైదరాబాద్ నుంచి లండన్ వరకు ప్రయాణించి, #LondonClimateActionWeek2026లో పాల్గొనడం గర్వకారణమని సంతోష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కామన్‌వెల్త్ సెక్రటేరియట్, House of Lordsలో ప్రపంచ నాయకులతో కలిసి వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి అంశాలపై చర్చలు జరిపారు.

వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఇప్పుడే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పర్యావరణ హిత పరిష్కారాలను అమలు చేసి, హరిత భవిష్యత్తు నిర్మాణానికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

 

#GreenIndiaChallenge, #ClimateAction, #Sustainability కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి కొనసాగుతుందని తెలిపారు.

- Advertisement -