ICFS ప్రతినిధులతో మాజీ ఎంపీ సంతోష్ భేటీ

1
- Advertisement -

లండన్ క్లైమేట్ యాక్షన్ వీక్ సందర్భంగా ICFS (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయినబిలిటీ) ను సందర్శించారు మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ . ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు తో పాటు ఆయన బృందాన్ని కలిసి వివిధ అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా సంతోష్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. భారత్-యూకే సంబంధాలు, పర్యావరణం, సంస్కృతి, సుస్థిర ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్యం, కృత్రిమ మేధస్సు (AI), నివారణ ఆరోగ్య సంరక్షణ వంటి కీలక అంశాలపై ICFS నిర్వహిస్తున్న పరిశోధనలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. భారతీయ మేధో వారసత్వాన్ని ఆధారంగా చేసుకుని తూర్పు ప్రపంచం నుంచి వెలుగు ప్రసరించాలనే భావనతో సంస్థ పనిచేస్తోందని తెలిపారు.

Also Read:ట్రెండింగ్‌లో ‘ఇరుముడి’ సాంగ్

ముఖ్యంగా నీటి భద్రతను జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత కీలక అంశంగా పరిగణిస్తూ సంస్థ చేస్తున్న కృషి, తమ ఇగ్నైటింగ్ మైండ్స్ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని అన్నారు. సచిన్ నందా….ఆయన బృందం చూపిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ, రెండు సంస్థల మధ్య అర్థవంతమైన స్నేహం, సహకారానికి ఇది నాంది అని సంతోష్ కుమార్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -