సనా మారీన్ డ్రగ్స్‌ తీసుకోలేదు: ఫిన్లాండ్‌ ప్రభుత్వం!

97
sanna
- Advertisement -

గత కొన్ని రోజులుగా ఫిన్లాండ్‌ లో రాజకీయం రసవత్తరంగా సాగింది. దానికి ఆ దేశ ప్రధాని పార్టీలో డ్రగ్స్‌ తీసుకుందని వార్తలు పుకార్లు షీకార్లు చేశాయి. కానీ ఎట్టకేలకు సనా మారిన్‌ డ్రగ్స్‌ రిపోర్ట్‌ వచ్చాయి. పార్టీ వీడియో వైరల్‌ కావడంతో అందరి అనుమానాలు నివృత్తి చేసేందుకు మారిన్‌ డ్రగ్స్‌ పరీక్ష చేయించుకున్నారు. ఆమె మూత్రం నమూనాలను పరీక్షంచగా నెగెటివ్‌ గా తేలింది. ప్రధాని సనా మారిన్‌ నుంచి ఆగస్టు 19, 2022న నమూనాలు సేకరించాం వాటిలో ఏలాంటి డ్రగ్స్‌ ఆనవాళ్లు కనిపించలేదు. నిబంధనలకు అనుగుణంగానే ఈ పరీక్ష జరిగింది అని డాక్టర్‌ పావో హలో నెన్‌ ఆద్వర్యంలోని వైద్యబృందం పరీక్షలు నిర్వహించారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. డ్రగ్స్‌ టెస్ట్‌ ఖర్చులను పూర్తిగా ప్రధాని స్వంతంగా భరించారని ప్రధాని కార్యలయంలోని ఓ అధికారి పేర్కొన్నారు.

ఈ విమర్శలను ఇది వరకే మారిన్‌ తోసిపుచ్చి విచారం వ్యక్తం చేశారు. ఓ సాయంత్రం వేళ మిత్రులందరం కలిసి పార్టీ చేసుకున్నాం ఆ సందర్భంగా డ్యాన్సులు పాటలు పాడటం వాస్తవమే ప్రైవేటుగా చేసుకున్న ఆ పార్టీ వీడియో లీక్‌ కావడం దురదృష్టకరం కేవలం ఆల్కహల్‌ తప్ప ఎటువంటి డ్రగ్స్‌ తీసుకోలేదు నాజీవితంలో ఎన్నడూ నేను వాటిన వాడలేదు. మేం చేసినవన్నీ చట్టానికి లోబడినవే మేం ఏ తప్పూ చేయలేదు అంటూ వివరణ ఇచ్చారు.

పీఎం మారిన్ ఒక ప్రవైట్‌ పార్టీకి హాజరైన వీడియో ఆగస్టు 17 న సోషల్ మీడియాలో లీక్ అయింది. అందులో ప్రధానితో పాటు మరి కొంతమంది వ్యక్తులతో కలిసి విపరీతంగా డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ, తాగుతూ కనిపించింది. 28 సెకన్ల నిడివి గల వీడియోలో ఫిన్లాండ్ ప్రధానితో సహా ఆరుగురు కలిసి డ్యాన్స్ చేస్తూ, పాడుతూ కనిపించారు. దీంతో రాజకీయంగా దుమారం లేవడంతో….. నివృత్తి చేసుకునేందుకు ప్రధాని డ్రగ్స్‌ పరీక్షలు చేసుకోంది.

- Advertisement -