సంక్రాంతికి ఆరు సినిమాలు

190
- Advertisement -

వచ్చే సంక్రాంతి కి రెండు తెలుగు బడా సినిమాలతో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమాలు రెండు థియేటర్స్ లోకి రానున్న విషయం తెలిసిందే. పొంగల్ బరిలో ఈ నాలుగు సినిమాలే అనుకునే లోపే మరో రెండు సినిమాలు వచ్చి లిస్టులో చేరాయి. జనవరిలో సంక్రాంతి కానుకగా కళ్యాణం కమనీయం అనే మీడియం రేంజ్ సినిమాతో పాటు వివాహం అనే చిన్న సినిమా కూడా రాబోతుంది.

యూవీ క్రియేషన్స్ లో సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అనుకున్నారు. కానీ సినిమా చూసుకున్న తర్వాత ఇది పర్ఫెక్ట్ సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని భావించి పొంగల్ పోటీలో నిలపబోతున్నారు. ఇప్పటికే జనవరి 14న డేట్ లాక్ చేసేసుకున్నారు. ఈ వారంలోనే ఫస్ట్ లుక్ వచ్చే వారం టీజర్, నెలాఖరున ట్రైలర్ ఇలా ప్లానింగ్ జరుగుతుంది.

ఇక వివాహం సినిమా విషయానికొస్తే ఇదొక చిన్న సినిమా. ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా రాజశేఖర్ కూతురు శివాని హీరోయిన్ గా తెరకెక్కిన యూత్ ప్లస్ ఫ్యామిలీ సినిమా. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేసి పోస్టర్ వదిలారు. జనవరి 14 నే ఈ సినిమా కూడా రాబోతుంది. ఏదేమైనా పెద్ద సినిమాల మధ్య ఈ మీడియం రేంజ్ సినిమా , చిన్న సినిమాకు కావలసినన్ని థియేటర్స్ లభిస్తాయా ? అసలు నాలుగు పెద్ద సినిమాల నడుమ ప్రేక్షకులు ఈ సినిమాలను పట్టించుకోని టికెట్టు కొంటారా ? చూడాలి. ఐదేళ్ళ క్రితం చిరంజీవి , బాలయ్య సినిమాలతో పాటు రిలీజైన శతమానం భవతి సంక్రాంతి సక్సెస్ అందుకుంది. చిన్న సినిమా అనుకుంటే పెద్ద హిట్టయింది. చెప్పెలేం సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయం కూడా అలా అన్ ఎక్స్ పెక్టెడ్ హిట్ అవుతుందేమో చెప్పలేం.

ఇవి కూడా చదవండి…

ఎన్టీఆర్ సపోర్ట్ తో గట్టేక్కేశాడు

ఒక్క హిట్ కే కోటి పెంచిన దర్శకుడు

జనవరి 13న వాల్తేరు వీరయ్య…

- Advertisement -