- Advertisement -
సంక్రాంతి సినిమాల సందడి రేపటి నుండే మొదలుకానుంది. ఈసారి బాక్సాఫీస్ ముందు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య తలపడనుండగా అలాగే తమిళ హీరో విజయ్ నటించిన వారసుడు కూడా సంక్రాంతి రేసులో ఉంది.
జనవరి 12న బాలయ్య పవర్ ఫుల్ వీర సింహా రెడ్డిగా చూసేందుకు తెలుగు ప్రేక్షకులు రెడీ అవుతున్నారు.ఇక జనవరి 13 న చిరు నటించిన వాల్తేరు వీరయ్య విడుదల కానుంది. జనవరి 14న విజయ్ నటించిన వారసుడు, సంతోష్ శోభన్ హీరోగా నటించిన కళ్యాణం కమనీయం రిలీజ్ కానుంది.
టాలీవుడ్‌లో సంక్రాంతికి మంచి మార్కెట్ ఉంది. తెలుగువారికి సంక్రాంతి పండగలో భాగంగా సినిమా చూడటం అలవాటు. అందుకే సంక్రాంతి రేసులో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతారు అంతా. సో ఈసారి కూడా సంక్రాంతి సినిమాలన్నీ ఘన విజయం సాధించాలని కోరుకుందాం..
ఇవి కూడా చదవండి..
- Advertisement -