బంగారం కొనుగోలుదారులకు శుభవార్త..

37
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారంపై రూ.150, కిలో సిల్వర్‌పై రూ.1200 తగ్గింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి రూ.51,450గా ఉండగా 24 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు రూ.160 తగ్గి రూ.56,130కి చేరింది.

బంగారం ధరతో పాటే వెండి రేటు భారీగా తగ్గింది. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రూ.1200 తగ్గి రూ.73,700కు చేరింది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1875.10 డాలర్ల వద్ద కొనసాగుతోంది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.63 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -